AP | రేషన్ బియ్యం తరలింపు.. పట్టుకున్న పోలీసులు..

AP | రేషన్ బియ్యం తరలింపు.. పట్టుకున్న పోలీసులు..
AP, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : రాత్రి గస్తీలో భాగంగా అవనిగడ్డలోని రాజీవ్ గాంధీ సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కోడూరు నుండి అవనిగడ్డ వైపు వెళుతున్న AP39UA5189 నెంబర్ గల బడా దోస్త్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1250 కేజీల రేషన్ బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోడూరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ద్వారా అవనిగడ్డ గ్రామానికి చెందిన కోసూరు రాజా గత కొంతకాలంగా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం.
గతంలో కూడా పలుమార్లు రేషన్ బియ్యం తరలిస్తూ పోలీసులకు కోసూరు రాజా పట్టుబడ్డాడు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు.

