AP | ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరో 15 ఏళ్లు – పవన్ కల్యాణ్ ఆకాంక్ష

విజయవాడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరో 15 సంవత్సరాలు పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

విజయవాడలోని A1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన శాసనసభ్యుల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అసాధారణ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన శాసనసభ్యులను, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించిన వారిని ప్రశంసించారు.రఘు రామకృష్ణ రాజు, కమిటీ సభ్యులు, క్రీడా శాఖ అధికారుల కృషికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, టగ్-ఆఫ్-వార్ వంటి వివిధ క్రీడా కార్యక్రమాలలో శాసనసభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల విజేతలందరినీ పవన్ కళ్యాణ్ అభినందించారు.పార్టీ అనుబంధాలు, సీనియారిటీ లేదా జూనియర్ హోదాతో సంబంధం లేకుండా పాల్గొనేవారు కలిసి రావడం, ఐక్యత, సామరస్యాన్ని ప్రదర్శించడం చూసి తాను ఆనందిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఎప్పుడూ పాలన, భవిష్యత్తు మీద ఆలోచనలతో గుంభనంగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా రోజులు తర్వాత మనసారా నవ్వడం చూశాను. ఒక శాసనసభ్యుడికే బోలెడు పనులు, సమస్యలు ఉంటాయి. అలాంటిది ఓ రాష్ట్రాన్ని మొత్తం చూసుకోవల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి నిత్యం ఆలోచనలతోనే ఉంటారు. గుంభనంగా ఉండే ఆయన మోముపై నవ్వుల పువ్వులు పూయించిన శాసన సభ్యులకు, మండలి సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

ఇలాంటి సత్సంప్రదాయం మనలో ఐక్యతను నింపుతుంది. వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన సభ్యులుగా ఒకే కూటమిలో ఉన్న మనకు ఇలాంటి పోటీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇలాంటి సంప్రదాయం ఎల్లపుడూ కొనసాగాలి. శాసనసభ్యుల్లో ఉన్న ఈ స్ఫూర్తి చూస్తే ముచ్చటేసింది. చిన్నప్పటి నుంచి క్రీడలకు నేను కాస్త దూరం. అయినప్పటికీ వచ్చే ఏడాది నేను కూడా ఏదైనా పోటీలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తాను.

సభాపతి c అయ్యన్న పాత్రుడు కి ధన్యవాదాలు.. స్వతహాగా హాస్య చతురతతో ఉండే సభాపతి అయ్యన్న పాత్రుడు చొరవ తీసుకొని ఈ పోటీలు నిర్వహించడం శుభ పరిణామం. సభ్యులు కూడా అంతే ఉల్లాసంగా పోటీల్లో పాల్గొన్నారు.

ధుర్యోధనుడిగా ఏక పాత్రాభినయం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణం రాజు ,, బాలచంద్రుడిగా చేసిన దుర్గేష్ కి, ఇతర సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని సాగనంపడానికి అంతా ఏకమై ముందుకు సాగాం. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడానికి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళదాం’’ అన్నారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, క్రీడా సామగ్రిని అందించడం, అథ్లెట్ల సౌకర్యాన్ని నిర్ధారించడంలో అంకితభావంతో వ్యవహరించినందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ కృషిని కూడా ఆయన ప్రశంసించారు.రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి చంద్రబాబు నాయకత్వాన్ని ఉపయోగించడం ప్రాముఖ్యతను పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.

“రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించడానికి కనీసం 15 సంవత్సరాల నిరంతర కృషి అవసరం. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని మనం విస్మరించలేం. నేను ఎల్లప్పుడూ ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *