వెలగపూడి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగరా మోగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కడప జడ్పీ ఛైర్ పర్సన్, కర్నూలు జడ్పీ కో-అప్టుడ్ మెంబ్, 28 ఎంపీపీలు, 23 వైస్ ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్‌లో 12 మంది కో-ఆప్ట్‌డ్ సభ్యులు, 214 మంది ఉపసర్పంచుల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో నేటి నుంచి నామినేషన్ ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది..ఇక ఈ స్థానాలకు ఈ నెల 27న ఉపఎన్నికలు జరగనున్నాయి.
ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగా.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర పోటీ జరగనున్నంది. అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి.. ప్రతిపక్ష వైసీపీ ఈ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి.