అమరావతి: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం నివాసానికి వచ్చిన శ్రీనివాసులు నాయుడును ఎమ్మెల్సీగా విజయం సాధించినందుకు సీఎం అభినందించారు.
ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని గౌరవిస్తామని చెప్పారు. అలాగే తన గెలుపునకు సహకరించిన సీఎంకు శ్రీనివాసులు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గాదెతో పాటు సీఎంను కలిసిన వారిలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ, తదితరులు ఉన్నారు.