- 8 మంది దుర్మరణం..
(ఆంధ్రప్రభ, ఓబులవారి పల్లె / అన్నమయ్య బ్యూరో) : అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె సమీపంలోని రెడ్డిపల్లి చెరువు కట్టపై ఘోర ప్రమాదం జరిగింది. మామిడి లారీ బోల్తా పడటంతో 9 మంది దుర్మరణం చెందారు. మరో 9 మంది గాయపడ్డారు.
ఆదివారం రాత్రి రాజంపేట నుంచి రైల్వే కోడూరు మామిడి మార్కెట్ కు మామిడికాయలతో కూడిన లారీ బయలుదేరింది. ఆ సమయంలో లారీ పైన 18 మంది కూలీలు ఉన్నారు. చెరువు కట్ట వద్దకు చేరుకోగానే లారీ అకస్మాత్తుగా బోల్తా పడింది.
ప్రమాద స్థలానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. రాజంపేట, రైల్వే కోడూరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే లారీ కింద చిక్కుకున్న 9 మంది గాయపడిన వారిని బయటకు తీసి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… పోలీసులు లారీ కింద నుంచి రెండు మృతదేహాలను బయటకు తీశారు. లారీ కింద చిక్కుకున్న మిగిలిన కార్మికులను బయటకు తీయడానికి క్రేన్లను తరలించారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.