AP | వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందే..సమైక్యతా శంఖారావం లో వక్తలు

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) భిన్న జాతులు, మతాలు, సంస్కృతులు ఉన్న మన దేశంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి తన పబ్బం గడుపుకుంటున్న పాలక భాజపా ప్రభుత్వానికి కాలంచెల్లె రోజులు దగ్గర పడ్డాయని చరిత్రలో హిట్లర్ కు పట్టిన గతే పడుతుందని, పలువురు వక్తలు హెచ్చరించారు. పార్లమెంట్ లో ఏకపక్షంగా ఆమోదించిన వక్ఫ్ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

మత సామరస్యం కోరుతూ సొసైటీ ఫర్ కమ్యునల్ హార్మని జాతీయ కమిటీ ఆద్వర్యంలో విజయవాడలోని స్థానిక సిద్ధార్థ అకాడెమీ ఆడిటోరియం లో సమైక్యతా శంఖారావం సదస్సు నిర్వహించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ ఖదీ, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తో పాటు సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అజీజ్ పాషా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి, హార్మనీ జాతీయ ఉపాధ్యక్షులు కే విజయరావు, యూపి మాజీ మంత్రి మొయిద్ అహ్మద్ రైతు ఉద్యమ నేత వడ్డే శోభనాద్రిస్వరరావు , సీనియర్ జర్నలిస్టు ఆనంద్ వర్ధన్ తదితరులు వక్తలు గా పాల్గొన్నారు.

తొలుత మహాత్మాగాంధీ జ్యోతిరావు పులే, బి ఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలామ్ చిత్ర పటాలకు పూలదండలతో నివాళులు అర్పించారు. సమైక్యతా శంఖారావం సూచికగా అభివాదం చేశారు.

అనంతరం ఇమ్రాన్ ప్రసంగిస్తూ వక్ఫ్ బిల్లు ఆమోదించి పార్లమెంట్ లో మోడీ అమిత్ షా లు చీకటి చట్టాన్ని చేశారని, గతంలో ఇలాగే పెద్ద నొట్ల రద్దు, జి ఎస్ టి, కార్పొరేట్ లకు ప్రయోజనం చేకూరే అనేక చట్టాలు తెచ్చారని అన్నారు. నిరుద్యోగ సమస్య, మహిళా సాధికారత, రైతుల సంక్షేమం ప్రక్కన పెట్టీ ప్రజల విశ్వాసాలను ఆసరాగా చేసుకుని హిందూ ముస్లిం, క్రైస్తవ మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ కార్పొరేట్ మీడియాను స్వంత చానల్స్ ను ఉపయోగించి భాజపా ఆరెస్సెస్ లు తన పబ్బమ్ గడుపుకుంటూ ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రగతిశీల భావాలు సామాజిక దృక్పథం మత సామరస్యం కోరుకునే ప్రతి ఒక్కరూ తమ సమాచార ప్రసార మాధ్యమాల్లో ముందు భాగాన ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.

సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్ పాషా , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో మతాల మధ్య ప్రజల మధ్య రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారని ఎద్దేవా చేశారు. విద్యా వైద్యం నిరుద్యోగం, అధిక ధరలు వంటి అనేక సమస్యలు వెంటాడుతూ ఉంటే అవేమీ పట్టకుండా మోడీ పాలన ఒక విధంగా ట్రంప్ పాలన ను తలపిస్తూదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *