CIJ Visit : వావ్ ..సూర్య‌చంద్రోద‌యం Andhra Prabha News

CIJ Visit : వావ్ ..సూర్య‌చంద్రోద‌యం Andhra Prabha News

హైకోర్టు జ‌డ్జీల బంగ‌ళాల క‌ళ‌

ఏపీ జ్యుడీషియ‌ల్ అకాడ‌మీకి పునాది

( ఆంధ్ర‌ప్ర‌భ‌, వెల‌గ‌పూడి ప్ర‌తినిధి)

CIJ Visit

ఏపీ న‌వ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆదివారం.. ఇటు చ‌ట్టాల సృష్టిక‌ర్త‌లు.. అటు చ‌ట్ట ప‌రిర‌క్ష‌కులు ఒకే వేదిక‌పై ఆశీన‌ల‌య్యారు. భార‌త స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు .ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అమ‌రావ‌తి తుళ్లూరు మండ‌లం రాయ‌పూడి స‌మీపంలో హైకోర్టు జ‌డ్జీల బంగ‌ళాల నిర్మాణ క్ర‌తువును ఏడేళ్ల కింద‌టే అప్ప‌టి ప్ర‌భుత్వం ప్రారంభించింది.

CIJ Visit

కానీ ఆ త‌రువాత వచ్చిన ప్ర‌భుత్వం జ‌డ్జీల బంగ‌ళాల నిర్మాణాన‌ని ప‌క్క‌న పెట్టేసింది. చేతిలె పైస‌లు లేవో.. అశ్ర‌ద్ధో.. ఈ ప‌ని ఆగిపోయింది. ఐదేళ్లల్లో ఈ భ‌వ‌నాల‌న్నీ శిథిల స్థితికి చేరుకున్నాయి. ద‌ట్ట‌మైన పిచ్చిమొక్క‌ల‌తో చిట్ట‌డ‌విని త‌ల‌పించింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఈ పనులు శ‌ర‌వేగంతో ప‌రుగులు తీశాచయి. ఈ రోజున అత్యంత అధునాత‌న స‌దుపాయాల‌తో జ‌డ్జీల బంగ‌ళాలు క‌ళ‌క‌ళ‌లాడాయి. వివ‌రాల్లోకి వెళ్దాం.

CIJ Visit

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ప్రారంభించారు. సి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో ₹ .210 కోట్ల వ్యయంతో 33.20 ఎకరాల విస్తీర్ణంలో 36 మంది హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఆధునిక సౌకర్యాలతో నివాస గృహాలను నిర్మించారు.

CIJ Visit

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 13 బంగాళాలను నిర్మించేందుకు తగిన స్థలాన్ని కూడా కేటాయించారు.
ప్రతి నివాస గృహాన్ని 7,841 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ నమూనాలో నిర్మించారు. న్యాయమూర్తుల అవసరాలకు అనుగుణంగా ఆఫీసు గది, వెయిటింగ్ హాల్ తదితర వసతులతో ఈ గృహాలను సమగ్రంగా రూపొందించారు.

CIJ Visit

బి.ఎస్.ఆర్. ఇన్ఫ్రాటెక్ సంస్థ నిర్మాణ బాధ్యతలను నిర్వర్తించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నివాస సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఆవిష్కరించారు. అనంతరం జడ్జిల బంగ్లాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎస్.వి.ఎస్. భట్టి, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శ్యామల రావు, సురేష్ కుమార్, సి.ఆర్.డి.ఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్.పి. వకుల్ జిందాల్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఇతర న్యాయమూర్తులతో కలిసి ఒక నివాస గృహాన్ని సందర్శించారు.

సూప‌ర్ జ‌డ్డీల‌కు పునాది

CIJ Visit

ఇక తుళ్ళూరు మండ‌లం పిచ్చుకలపాలెంలఓ8 ఏపీ జ్యుడీషియల్ అకాడమీ భ‌వ‌న నిర్మాణాల‌కు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ శంకుస్థాప‌న చేశారు. సుమారు 4.83 ఎకరాల స్థలంలో ₹ 165 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్నారు.

CIJ Visit

మొత్తం భవన నిర్మాణ విస్తీర్ణం సుమారు 2.05 లక్షల చదరపు అడుగులు ఉంటుంది .ఇందులో అకడమిక్ బ్లాక్ (G+3), హాస్టల్ బ్లాక్ (G+8), ఇండోర్ స్పోర్ట్స్, గెస్ట్ హౌస్, 500 సీట్ల సామర్థ్యం గల ఆడిటోరియం వంటి అత్యాధునిక వసతులు ఉంటాయి. ప్రతి బ్యాచ్‌లో 120 మంది ట్రైనీ జడ్జిలకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేలా దీనిని రూపొందించారు.

CIJ Visit

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply