ఆర్థిక విప్లవానికి ఏపీ కీలకం
- ఏపీ వేగాన్ని ప్రపంచం గమనిస్తోంది
- డబుల్ ఇంజన్ తో మరింత వేగం పెరిగింది
- గూగుల్ పెద్ద దిగ్గజం పెట్టుబడి ప్రకటించింది
- సీఎం. డిప్యూటీ సీఎం ఉన్నారు
- ఒకరు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు
- తోడుగా పవన్ కళ్యాణ్ ఉన్నారు
- వీరికి కేంద్ర ప్రభుత్వం సహారం ఉంటుంది
- నన్నూరు సభలో ప్రధాని మోడీ
కర్నూలు , ఆంధ్రప్రభ బ్యూరో : దేశ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా కీలకం. ఏపీ అభవృద్ధి చెందాలంటే రాయలసీమ కూడా అభివృద్ధి అంతే అవసరం ఉంది, వికసిత్ భారత్ 2047 సాధన సంకల్పానికి స్వర్ణాంధ్ర లక్ష్యం మరింత బలం అందిస్తుంది.కేంద్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ వేగాన్ని మరింతగా పెంచుతుంది. భారత్ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తోంది” ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
కర్నూలు జిల్లా నన్నూరు లో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. అంతక ముందు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నన్నూరులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో మాట్లాడుతూ, ద్వాదశజ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్ సోమనాధ్(Gujarat Somnath) ఆలయం ఉంది. అక్కడే నేను పుట్టాను.
రెండో జ్యోతిర్లింగం శ్రీశైల మల్లిఖార్జున స్వామిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నాను. ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా దర్శించి ఆయనకు అల్లమ్మ ప్రభు, అక్కమహాదేవి లాంటి శివభక్తులకు ప్రణామాలు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి లాంటి ధీరులకు వినమ్రపూర్వక నమస్కారం, మోదీ రాయలసీమ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ శాస్త్రసాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం, యువత ఎంతో చైతన్యవంతులు. ఏపీలో విజన్ ఉన్న నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి నేతలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ(Central Government) సహకారం కూడా ఉంది. .
దేశ ఆర్ధిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఓ కీలక ప్రాంతంగా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ది దిశగా నడుస్తోంది. గత 16 నెలల్లో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏపీలో ప్రగతి వేగంగా జరుగుతోంది. ఢిల్లీ, అమరావతిలు రెండూ వేగంగా అభివృద్ది దిశగా వెళ్తున్నాయి. స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తైన 2047 నాటికి భారత్ వికసిత్ భారత్ గా తయారవుతుంది. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజం ఏపీలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. దేశపు తొలి అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(Intelligence) కేంద్రం విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అమెరికా వెలుపల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్ పెడుతున్నట్టు గూగుల్ సీఈఓ చెప్పారు. డేటా సెంటర్,ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లాంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. ప్రపంచ దేశాలను కలుపుతూ వేయనున్న సబ్ సీ కేబుల్ ద్వారా తూర్పు తీరం బలోపేతం అవుతుంది. విశాఖలో ఏర్పాటు కానున్న కనెక్టివిటీ హబ్ భారత్ కే కాదు ప్రపంచానికి సేవలందింస్తుంది… సీఎం చంద్రబాబు విజన్(Vision) ను అభినందిస్తున్నాను, అని మోదీ ప్రకటించారు. కర్నూలులో ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయి…
పారిశ్రామిక అభివృద్ది వేగంగా జరుగుతుంది. ఏపీ వేగవంతమైన అభివృద్ధి కోసం కొప్పర్తి -ఒర్వకల్ పారిశ్రామిక నోడ్ల ద్వారా పచ్చే పెట్టుబడులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.21వ శతాబ్దపు మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా ప్రపంచ దేశాలు భారత్ ను చూస్తున్నాయి. భారత్ లో ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటోంది… ఆత్మనిర్భర్ భారత్ లో ఏపీ కీలకంగా మారింది. 21 వ శతాబ్దం భారత దేశానిది, 140 కోట్ల మంది భారతీయులది అవుతుంది. విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, రక్షణ రంగాలకు చెందిన చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాం, అని ప్రధాని మోదీ వివరించారు.
ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో కనెక్టివిటి(Connectivity) బలోపేతం కావటంతో పాటు పరిశ్రమలను బలోపేతం చేస్తాయి. ఈ ప్రాజెక్టులతో కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది. దేశానికైనా, రాష్ట్రానికైనా ఇంధన భద్రత అవసరం. ప్రస్తుతం 3 వేల కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించాం… తద్వారా దేశ ఇంధన సామర్ధ్యం పెరుగుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్ అవుట్ లాంటి విద్యుత్ సంక్షోభాలు వచ్చాయి… తలసరి విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల కంటే తక్కువే ఉంది.చాలా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు క్లీన్ ఎనర్జీ నుంచి మన అవసరాలకు తగినంత ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నాం. 1400 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు దేశంలో ఉంది.
తగినంత విద్యుత్ దేశ ప్రజలకు లభ్యం అవుతోంది, అని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి ఆంగుల్ వరకూ గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేశాం . 20 వేల సిలిండర్ల సామర్ధ్యంతో ఇండేన్ బాటిలింగ్ ప్లాంట్‌ను చిత్తూరులో ప్రారంభించాం. మల్టీ మోడల్ ఇన్ఫ్రా ప్రాజెక్టుల(Model Infra Projects)తో కనెక్టివిటీ పెంచుతున్నాం. సబ్బవరం నుంచి షీలా నగర్ వరకూ కొత్త హైవేతో కనెక్టివిటీ పెరిగింది. రైల్వే రంగంలో కొత్త యుగం ప్రారంభమైంది… ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రాజెక్టులను ప్రారంభించుకున్నాం, అని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
అంతకుముందు కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్(Governor S. Abdul Nazeer), సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. రాష్ట్రంలోని పరిశ్రమలు, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, రక్షణ, పెట్రోలియం వంటి పలు రంగాలకు చెందిన సుమారు రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ వేదికపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సత్కరించారు. మహాశివుని ప్రతిమను బహూకరించారు.


