అమరావతి మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ వి.వి.ఆర్. కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. “అమరావతి దేవతల రాజధాని కాదు… వేశ్యల రాజధాని” అని ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తూ తీవ్ర దుమారం రేపాయి.
ఈ వ్యాఖ్యలను రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. అప్పటి నుండి, వి.వి.ఆర్. కృష్ణంరాజు పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు.
కానీ బుధవారం రాత్రి, అతని సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా భీమిలి గోస్తానీ నది దగ్గర పోలీసులు అతన్ని గుర్తించి, వెంటనే అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడకు తీసుకెళ్లినట్లు సమాచారం.