ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పదవికి జివి రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. దాంతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖ పంపారు.
”వ్యక్తిగత కారణాల వల్ల టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ ప్రతినిధి పదవికి, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన నమ్మకానికి, అందించిన సహాయానికి, ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించే అవకాశాన్ని కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
టీడీపీ మరింత బలపడి ప్రజాసేవలో ముందుండాలని కోరుకుంటున్నాను. ఇకపై న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని, భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేద”ని జీవీస్ రెడ్డి అన్నారు.
