AP | భవిష్యత్ తరాల కోసం..

AP | భవిష్యత్ తరాల కోసం..

AP, బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే.. పంటలు అతివృష్టిని, అనావృష్టిని సైతం తట్టుకొని నిలిచి అధిక దిగుబడులు వస్తాయని జిల్లా కలెక్టర్ (Collector) వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం గోవాడ గ్రామానికి చెందిన రైతు నరిశెట్టి రమేష్ 18 సంవత్సరాలుగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిని అనుసరిస్తూ సేంద్రీయ వ్యవసాయం చేస్తూ భూమిని భవిష్యత్ తరాల కోసం సంరక్షిస్తున్నారని కలెక్టర్ వినోద్ కుమార్.. రైతు రమేష్ ను ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తొలకరికి ముందే విత్తనం వేయడం విధానం పాటించినట్లయితే.. భూమిలో సారం పెరగడమే కాకుండా ఆయా పంటల నుండి కొంతమేర దిగుబడులు పొందవచ్చునని కలెక్టర్ తెలిపారు.

పీఎండిఎస్ పద్ధతి విధానం వల్ల కలుపు మొక్కలు తగ్గి, నేల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ సామాజిక మాధ్యమంలో రమేష్ కృషిని ప్రోత్సహిస్తూ వైరల్ చేశారు. రమేష్ 25 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షాలు తుఫాన్లు నీటి ఎద్దడా వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను 18 సంవత్సరాలుగా అనుసరిస్తూ కలెక్టర్ ప్రశంసలు పొందారు. 2018 నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తూ సీఎండీఎస్ పద్ధతిని అనుసరిస్తూ విత్తనాలను చల్లుకుంటూ పిఎండిఎస్ ను సాగు చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా కలుపు సమస్య చీడపీడలసమస్యలను అధిగమించి పరాన్న జీవులు మిత్ర జీవులు పెంపొందించుకొని ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మూలంగా రైతులకు ఉపయోగకరమని తెలిపారు.

క్షేత్రంలో 15 రకాలు చిరుధాన్యాలు చల్లి సాగు చేస్తున్నామని జీలుగా, దసరా, జానుము, పిల్లి పిసర వంటి విత్తనాలను చల్లి సాగు చేస్తున్నానని తెలిపారు. దిగుబడి ఎరువుల వ్యవసాయం కంటే అధికంగా ఉందని తెలిపారు. మంచి దిగుబడి వస్తుందని దేశవాళీ వరి విత్తనాలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. పిఎండిఎస్ పద్ధతితో ఎక్కువ దిగుబడులు వస్తున్నాయన్నారు. రైతు వద్ద ఉన్న గోవులకు పిఎండిఎస్ వల్ల పుష్కలంగా ఆహారం అందిస్తున్నామన్నారు. రమేష్ కు చెందిన పది ఎకరాలలో పిఎండిఎస్ పద్ధతి అనుసరిస్తున్నట్లు తెలిపారు. దేశవాళీ విత్తనాలతో వరి సాగు చేస్తున్నానని అనంతరం నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, మినుములు సాగు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని రకాల కూరగాయలను సైతం సాగు చేసి దిగుబడిని మా ప్రాంత ప్రజలకు విక్రయిస్తున్నట్లు తద్వారా ఆదాయం రెట్టింపు అయిందని ప్రకృతి వ్యవసాయం తోనే సాధ్యమవుతుందని తెలియజేశారు.

Leave a Reply