Ap Deputy Cm | టీటీడీ నిధులతో కొండగట్టు ఆలయ అభివృద్ధి

Ap Deputy Cm | టీటీడీ నిధులతో కొండగట్టు ఆలయ అభివృద్ధి
- గిరి ప్రదక్షణకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
- రాముడు, అంజన్నల సేవలో తరిస్తా..
- ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్
Ap Deputy Cm | జగిత్యాల, మాల్యాల, ఆంధ్రప్రభ : తనకు పునర్జన్మనిచ్చింది కొండగట్టు అంజన్ననేనని, రాముడు, అంజన్నసేవలో తరిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu) శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తొలుత జేఎన్టీయూ హెలిప్యాడ్ వద్ద ప్రత్యేక హెలికాప్టర్లో దిగిన పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ (Telangana) రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. హెలిపాడ్ నుండి అంజన్న ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు కొండగట్టు అంజన్న ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Ap Deputy Cm | ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను (Pawankalyan ) ఆలయ అర్చకులు ఆశీర్వదించి, స్వామివారి శేష వస్త్రంతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

టీటీడీ చైర్మన్‌కు కృతజ్ఞతలు
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే (Mla) మేడిపల్లి సత్యం తనకు చిన్ననాటి నుండి స్నేహితుడేనని, ఆయనతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషకరమన్నారు. గిరి ప్రదక్షణకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని, కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించడం హర్షనీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతరం ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ ఉన్నత అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం భక్తులకు, అభిమానులకు అభివాదం చేస్తూ జేఎన్టీయూ వద్ద నిర్వహించనున్న పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్లారు.


