AP | రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

AP | రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
AP, పెడన, ఆంధ్రప్రభ : పెడన టౌన్ వైఎస్ఆర్ (YSR) కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పెడన నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఉప్పాల రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
