Ap Cm New Style : జ‌నం కోసం.. .జ‌నంతో Andhra Prabha Top Story

Ap Cm New Style : జ‌నం కోసం.. .జ‌నంతో Andhra Prabha Top Story

  • ఏపీ సీఎం ప‌బ్లిక్ రిలేష‌న్‌
  • సూరేప‌ల్లిలో సూరీడుగా..
  • రైతుల‌తో రైత‌న్న‌గా..
  • మండుటెండ‌లోనూ.
  • పొలంబాట‌లో ఏపీ సీఎం చంద్ర‌న్న‌
  • త‌మ‌తో సీఎం మాటామంతీకి రైతులు ఆశ్చ‌ర్యం

ఆంధ్ర‌ప్ర‌భ‌, ఏపీ న్యూస్ నెట్ వ‌ర్క్

Ap Cm New Style

ఏపీ సీఎంలో కొత్త చంద్రబాబును,, కాదు నవ చంద్రన్నను చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. 31 ఏళ్ల కింద‌ట అంటే 1005లో సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబునాయుడు.. ఈ మూడు ద‌శాద్ధాల్లో ఆయ‌న నైజం.. ప్ర‌వ‌ర్త‌న తీరును .. ఇప్ప‌టి వ్య‌వ‌హార‌శైలిని బేరీజు వేస్తూ.. జ‌నం గొప్ప‌గా చెప్పుకొంటున్నారు. నిత్యం అధికారుల‌తో స‌మీక్ష‌లు.. అధికారిక ప‌ర్య‌ట‌న‌ల‌తో పద‌వి కాలంలో బిజీబిజీగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ఏపీ సీఎం నైజం 1997లోనే ప్ర‌జ‌ల మ‌నోభావాలు తెలుసుకోవాల‌ని.. ప్ర‌జాస‌బంధాలు పెంచుకోవాల‌ని చంద్రా బాబు త‌పించారు. దూర‌ద‌ర్శ‌న్ లో ప్ర‌తి సోమ‌వారం ఉమ్మ‌డి ఏపీ ప్ర‌జ‌ల‌న్ని ప‌ల‌క‌రించారు. కానీ.. ప్ర‌జాసంబంధాలు సుదూరం కాక‌త‌ప్ప‌లేదు. ఇక 3035 ఎన్నిక‌ల.. ఆయ‌న‌లో చాలా మార్పు వ‌చ్చింది. ప్ర‌జ‌ల‌తో క‌లిసి పోతున్నారు. ఇళ‌కు వెళ్లున్నారు. కుటుంబ ప‌రిస్థితులు తెలుసుకుంటున్నారు. కుటుంబ స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
తాజాగా..

Ap Cm New Style : రైతులతో రైత‌న్న‌గా.. .

Ap Cm New Style

            పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కోసం గురువారం సూరేపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. స్థానిక రైతులను క‌లిశారు. స్వ‌యంగా రైతుల‌కు ప‌ట్టాదార్ పుస్త‌కాలు అంద‌జేశారు. రైతుల కుటుబ ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారుజ మ రాల వెంకటేశ్వర్లు, వాకా శ్రీనివాసరావు తో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతులతో కలిసి ఆ పొలంలోనే కలియ తిరుగుతూ సాగు వివరాలు, కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం స్థాయిలోని వ్యక్తి ఒక రైతుబిడ్డగా తమతో ఆప్యాయంగా మాట్లాడడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు

Ap Cm New Style : పాస్ పుస్తకం వచ్చింది..!

Ap Cm New Style

           నా పేరు మురాల వెంకటేశ్వర్లు( 62). దాదాపుగా 20 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం ప్రభుత్వం 25 సెంట్లు వ్యవసాయ భూమి ఇచ్చింది. కానీ పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు. అందుకని ఎలాంటి రుణం కూడా లభించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రీ సర్వే చేసి పాస్ పుస్తకం ఇచ్చారు. ఈ భూమిలో వరి సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాను. ప్రభుత్వం నుంచి పెన్షన్, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా అందుతున్నాయి. మాలాంటి పేదలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు.

Ap Cm New Style : 22(ఏ) పీడ వీడింది

Ap Cm New Style

       నా పేరు వాకా శ్రీనివాసరావు ( 61). వారసత్వంగా మాకు లభించిన 53 సెంట్ల పట్టా భూమిలో వరి, మినుములు, మొక్కజొన్న సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాము. మాభూమి పొరపాటున 22(ఏ) జాబితాలో ఉంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా రీసర్వే చేసి స్పష్టమైన సరిహద్దులతో మాకు కొత్తపాస్ పుస్తకం మంజూరు చేశారు. నాకు పెన్షన్, మా కుటుంబానికి ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు వస్తున్నాయి. నాలాంటి వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు.

ALSO READ : Ap Cm With People : పేదమ్మకు భరోసా Andhra Prabha News

Leave a Reply