AP Cabinet meeting | 19న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించి, నిర్ణయాలు తీసుకోనుంది.

అలాగే ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు వివిధ అంశాలను చర్చించి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపే అవకాశముంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు, బనకచర్ల ప్రాజెక్ట్‌, నదుల అనుసంధానం, వివిధ పరిశ్రమలు, సంస్థలకు భూముల కేటాయింపు, పెట్టుబడులకు ఆమోదం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది.

Leave a Reply