వెలగపూడి – సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని, దీంతో ఆడబిడ్డలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొందన్నారు ఎపి సిఎం చంద్రబాబు.. దీనిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఒక సైబర్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. హద్దుదాటి పోస్టింగ్ లు చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామని చెప్పారు.. అసెంబ్లీలో నేడు ఆయన మాట్లాడుతూ తాము తీసుకుంటున్న చర్యలతో . ఇకపై ఎవరైనా ఆడబిడ్డలపై అత్యాచారాలు చేసి తప్పించుకోవాలనుకుంటే కూటమి ప్రభుత్వంలో వీలుకాదన్నారు. ఆడిబిడ్డలను వేధించే అకతాయలకు పోస్ట్ పెట్టిన రోజే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.
గత ప్రభుత్వంలో గణనీయంగా పెరిగిన గంజాయి సాగు
గత ప్రభుత్వంలో వరి పంట విస్తీర్ణం పెరగలేదని, అయిదే గంజాయి సాగు విస్తీర్ణం మాత్రం గణనీయంగా పెరిగిందన్నారు. తాము అధికారంలో వచ్చిన రోజు నుంచి గంజాయి ని అరికట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు చంద్రబాబు . తమ హాయంలో ఎవరూ కూడా ఎట్టి పరిస్థితిల్లోనే రాష్ట్రంలో గంజాయి పండించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. గంజాయిని అంతం చేసే వరకూ ప్రభుత్వం నిరంతం పోరాడుతూనే ఉంటుందన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామన్నారు. గంజాయి పండించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామన్నారు. మత విద్వేషాలు లేని వాతావరణం ఉండాలన్నారు. ముఠాలు, కుమ్ములాటలు ఇక చెల్లవని రాష్ట్రంలో రౌడీలు ఉండడానికి వీల్లేదన్నారు. రౌడీయిజం చేసి తప్పించుకుంటాం అంటే కుదరదని సీఎం స్పష్టం చేశారు.