AP Assembly | వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళ‌న

AP Assembly | వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళ‌న

  • సభలో వైసీపీ సభ్యుల విజిల్స్
  • ఇందాపూర్ డెయిరీ వివాదంపై చ‌ర్చ‌కు వైసీపీ ప‌ట్టు

AP Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే శాస‌న‌మండ‌లి మ‌ళ్లీ వాయిదా ప‌డింది. నిన్నటి నుంచి వైసీపీ నేతలు మండలిలో నిరసనలు తెలపడంతో మళ్లీ వాయిదా వేశారు. ఇందాపూర్ డెయిరీ వివాదంపై వైసీపీ చ‌ర్చ‌కు ప‌ట్టుప‌ట్టింది. ఈ క్ర‌మంలో స‌భ‌లో వైసీపీ నాయ‌కులు విజిల్స్ వేశారు. చైర్మ‌న్ విజిల్స్ వేయ‌వ‌ద్ద‌ని వాదించినప్ప‌టికీ వైసీపీ నాయ‌కులు విన‌లేదు. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు.

వైసీపీ నేత‌ల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ స‌భ‌ను వాయిదా వేశారు. తిరుప‌తి ల‌డ్డూలో ఉప‌యోగించిన నెయ్యి క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్చ కోసం వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన తీర్మానాల‌ను చైర్మ‌న్ కొయ్యే మోషేన్ రాజు తిర‌స్క‌రించారు. మ‌రోవైపు వైసీపీ ఎమ్మెల్సీలు బుధవారం కూడా ఇందాపూర్ డైయిరీ పేరుతో టీటీడీకి స‌ర‌ఫ‌రా చేసిన నెయ్యిపై చ‌ర్చ‌కు డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్టారు.

Leave a Reply