AP – నామినేషన్ లు దాఖలు చేసిన కూటమి అభ్యర్ధులు

టీడీపీ నుంచి గ్రీష్మ‌, బీద ర‌విచంద్ర‌, బీటీ నాయుడు
బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేష‌న్స్
నామినేష‌న్స్ కార్య‌క్ర‌మానికి కూట‌మి నేత‌లు హాజ‌రు
అభ్య‌ర్ధులంతా ఏక గ్రీవంగా ఎన్నిక‌య్యే అవ‌కాశం

వెల‌గ‌పూడి, ఆంధ్ర‌ప్ర‌భః ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ముగ్గురు అభ్యర్థుల‌తో పాటు బీజేపీ అభ్య‌ర్ధి నేడు నామినేష‌న్ లు దాఖ‌లు చేశారు. నేటితో నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగియ‌నుండ‌టంతో అంద‌రూ నామినేష‌న్ లు వేశారు. టీడీపీ త‌రుపున కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద ర‌విచంద్ర‌, బీజేపీ త‌రుపున సోము వీర్రాజు లు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్ధులుగా త‌మ నామినేష‌న్ ప‌త్రాల‌ను రిట‌ర్నింగ్ అధికారికి అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీల పాల్గొన్నారు. .

కాగా, ఏపీలో మొత్తం ఎమ్మెల్యే కోటాలో అయిదు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోటీ జ‌రుగుతుండ‌టంతో కూట‌మి పార్టీలు సీట్లు స‌ర్దుబాటు చేసుకున్నాయి. టీడీపీ మూడు స్థానాల‌లో పోటీ చేస్తుండ‌గా జ‌న‌సేన‌, బీజేపీకి ఒక్కో స్థానం కేటాయించారు.. ఇప్ప‌టికే జ‌న‌సే అభ్య‌ర్ధి నాగబాబు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఇక మిగిలిన నలుగురు నేడు నామినేష‌న్‌లు వేశారు.. అయిదు స్థానాల‌కు అయిదు నామినేష‌న్‌లు దాఖ‌లు కావడంతో నామినేష‌న్‌ల ప‌రిశీల‌న అనంత‌రం వారంతా ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించ‌నున్నారు..

చంద్రబాబు మార్క్ ఎంపిక ..
ఇక టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ఎంపిక‌లో కొత్త పంధాను అనుస‌రించారు.. సామాజిక స‌మీక‌ర‌ణ‌లతో పాటు పార్టీ వీర విధేయుల‌కు ఈ సారి ఛాన్స్ ఇచ్చారు. దీనిలో భాగంగానే, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి యువ మహిళ కావలి గ్రీష్మకు అవకాశం దక్కింది. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా పోరాటాలు చేశారు. అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. టికెట్ రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. దీంతో ఈ సారి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. బీద రవిచంద్ర కూడా ఇదే పరిస్థితి పార్టీకి అంటిపెట్టుకొని ఉండి టికెట్ విషయంలో కొంత ఇబ్బందులు ఎదురైనా సర్దుకుని పోయారు.. సర్దుకుని వెళ్లారు దీంతో ఎమ్మెల్సీ స్థానం ఆశించారు. ఆశించినట్టుగానే చంద్రబాబు న్యాయం చేశారు. బీటీ నాయుడు కూడా రెన్యువల్ కావాలని అడిగారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.. చంద్రబాబు అరెస్ట‌యిన సమయంలో కూడా ఉండి కుటుంబ సభ్యులకు.. పార్టీ నేతలకు ఎంతో నైతిక ధైర్యం ఇచ్చారు. అందుకే చంద్రబాబు తిరిగి రెన్యువల్ చేసినట్టు సమాచారం.

మోదీకి, పార్టీ అధిష్టానానికి థ్యాంక్స్ – సోము వీర్రాజు

కూటమి పొత్తులో భాగంగా తమకు లభించిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా బీజేపీ అధినాయకత్వం సోము వీర్రాజును ప్రకటించింది. ఈ నేపథ్యంలో, పార్టీ అధిష్ఠానానికి సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. “ఏపీ శాసనమండలి ఎన్నికల కోసం నామినేషన్ వేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం, పార్టీ ఎదుగుదల కోసం అవిశ్రాంతంగా కృషి చేసేందుకు కట్టుబడి ఉంటాను. పార్టీ కేంద్ర నాయకత్వం మార్గదర్శనంలో ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషిని కొనసాగిస్తాం” అని సోము వీర్రాజు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *