AP | ఆగ్రహించిన టీడీపీ నేతలు..

AP | ఆగ్రహించిన టీడీపీ నేతలు..

  • అంబటి రాంబాబు, జోగి రమేష్ దిష్టిబొమ్మలకు శవ యాత్ర
  • స్మశాన వాటిక వద్ద దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన టీడీపీ నేతలు

AP | ఘంటసాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు విమర్శలు చేయటంపై కృష్ణా జిల్లా ఘంటసాల మండల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘంటసాల గ్రామంలోని బ్యాంక్ సెంటర్ లో అంబటి రాంబాబు, జోగి రమేష్ దిష్టిబొమ్మలకు చెప్పుల దండలు వేసి ఊరేగింపుగా స్మశాన వాటిక వరకు తీసుకొచ్చాడు. జోహార్ జోగి రమేష్, జోహార్ అంబటి రాంబాబు అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తూ గ్రామ పురవీధుల్లో శవ యాత్ర నిర్వహించారు. డప్పులు వాయిస్తుండగా, దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

AP

ఈ సందర్భంగా ఘంటసాల పీఏసీఎస్ అధ్యక్షులు బండి పరాత్పరరావు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ఒక వెదవ అని, ఆయనను నమ్ముకుని వాళ్లంతా వెదవలే అన్నారు. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెబుతున్నప్పటికీ అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుత ఉన్నారని, అలా మాట్లాడితే సహించేది లేదన్నారు. మా నాయకుడు చంద్రబాబు శాంతంగా ఉండమని మాకు చెప్పటం కారణంగానే ఓపికగా ఉన్నామని తెలిపారు. జగన్మోహన్రెడ్డిని నమ్ముక ఉన్న వాళ్లంతా జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జోగి రమేష్ కల్తీ మద్యం తయారు చేయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

AP

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు, జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ. శ్రీకాకుళం డీసీ చైర్మన్ అయినపూడి బాను ప్రకాష్, గొర్రెపాటి సురేష్, దోనేపూడి బుజ్జి, కాకుమాని రంగారావు, అయినపూడి విజయకుమార్, వేమూరి రమేష్, గొర్రెపాటి శ్రీనివాస్, జగ్గారపు నాగేశ్వరరావు, నందం నరసింహారావు, బండి అర్జునరావు, యార్లగడ్డ వీరభద్రరావు, పాటిబండ్ల నరేష్, కొడాలి లక్ష్మణ్, పొట్లూరి యోహాను, సోలే శ్రీను, దిరిశం సుధీర్, దిరిశం సుబ్బారావు, జనసేన నాయకులు యార్ల శ్రీకాంత్ తదితర టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply