AP | మోపిదేవి ఆలయ ఆదాయం ఎంతంటే..!

AP | మోపిదేవి ఆలయ ఆదాయం ఎంతంటే..!

AP | మోపిదేవి, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్య క్షేత్రమైన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. వివిధ సేవా టిక్కెట్ల ద్వారా ఒక్కరోజే రూ. 10,24,423 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు సోమవారం తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, ప్రసాదం విషయంలో పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు ఆయన సోమవారం వెల్లడించారు.

Leave a Reply