AP | పైపుల గోదాంలో అగ్నికీలలు..

AP | పైపుల గోదాంలో అగ్నికీలలు..

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకొని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అగ్నిమాపక శకటాలతో మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల వెలగపూడి సమీపంలో ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన కోట్ల రూపాయల విలువైన హెచ్‌డీపీఈ పైపులు ఇదే తరహాలో మంటల్లో దగ్ధమైన ఘటన మరువకముందే మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Leave a Reply