AP | 1721 ఉపాధి పనుల గుర్తింపు

AP | 1721 ఉపాధి పనుల గుర్తింపు

AP | నాగాయలంక, ఆంధ్రప్రభ : 2026-27 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 22 పంచాయతీలలో 1053.09 లక్షలతో ఉపాధి పనులు చేసేందుకు గ్రామ సభల ద్వారా గుర్తించినట్లు పథకం ఏపీ ఓటీవీఎన్ ముత్యాలు తెలిపారు. భావదేవరపల్లిలో 112, చోడవరంలో 130, ఎదురు మొండిలో 131, ఈలచెట్లదిబ్బలో 56, ఏటిమొగలో 33, గణపేశ్వరంలో 95, గుల్లలమోదలో 60, కమ్మన మోలులో 104, మర్రి పాలెంలో 36, నాగాయలంక లో 12, నాలిలో 61, నంగేగడ్డలో 62, నాచుగుంటలో 57, పర్రచివరలో 165, పెద కమ్మవారి పాలెంలో 57, పెదపాలెంలో 47, రేమాలవారిపాలెంలో 34, సంగమేశ్వరంలో 62, సొర్ల గొందిలో 90, టి.కొత్త పాలెంలో 80, తలగడ దీవిలో 166, వక్కపట్ల వారి పాలెంలో 71 పనులను గుర్తించగా, ఆ జాబితాను ఉన్నతాధికారులకు పంపామన్నారు.

Leave a Reply