ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో..

ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో..

చల్లని మజ్జిగ పంపిణీ..చేస్తున్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.
ప్రజలకు ఉపశమనం
చల్లని మజ్జిగ పంపిణీ
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు..

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం చల్లని మజ్జిగ పంపిణీ చేయడమేనని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీ ఎఫ్. బ్లాక్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే 23వ డివిజన్ సూర్యారావుపేట చిలుకు దుర్గయ్య వారి వీధిలో శ్రీ జయ విజ్ఞేశ్వర ఆలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. స్థానిక ప్రజలు, మహిళలు, కార్మికులు, వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మజ్జిగను స్వీకరించారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పరం సహకారం, సేవా భావంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తగినంత నీరు మరియు చల్లని పానీయాలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలలో ఐక్యతను పెంపొందించడంతో పాటు, మానవత్వాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 60వ డివిజన్ ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, క్లస్టర్ ఇంచార్జ్ కంచి ధన శేఖర్,డిడి నాయుడు, దేవర సూరి, వాసు, సురేష్, చింత దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply