AP | శివలింగాల త‌యారీ..

AP | శివలింగాల త‌యారీ..

  • తొలి రోజు శివలింగాల తయారీని ప్రారంభించిన మాజీ ఎంపీపీ సూర్యభవాని

AP | ఘంటసాల, ఆంధ్రప్రభ : హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా గుంటూరు జిల్లా తాళ్ళాయపాలెంలోని భారత ధర్మ దేవత బ్రహ్మచారి శివస్వామి మహా సంస్థానం శ్రీశైవక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా అహోరాత్ర కోటి పార్ధివ లింగార్చన మహాజాగరణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి కోటిలింగాలకు అభిషేకం నిర్వహించనున్నారు. ఘంటసాల నుంచి లక్ష మట్టి శివలింగాలు కోటి లింగార్చనకు సమర్పించేందుకు ఈ రోజు అంకురార్పణ చేశారు.

AP

తాళ్ళాయపాలెం శివాలయం నుంచి పుట్టమట్టి, తదితరాలు ఘంటసాలకు పంపించగా, మాజీ ఎంపీపీ అందె సూర్యభవాని, మహిళలు శివలింగాల తయారీని ప్రారంభించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తిభావంతో లక్ష శివలింగాలు తయారు చేసి ఫిబ్రవరి 10లోగా తాళ్లాయపాలెం శివాలయానికి పంపించాల్సి ఉందని మాజీ సర్పంచ్, బీసీ నేత అందె జగదీష్ తెలిపారు. పుట్టమట్టితో శివలింగాలు తయారు చేయాలనుకునే భక్తులకు పుట్టమట్టి తదితరాలు అందించటం జరుగుతుందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శివుని కృపకు పాత్రులు కావాలని కోరారు. భక్తిభావంతో ఇంటి వద్ద వీటిని తయారు చేసి తమకు అందజేయవచ్చునని అందె జగదీష్ తెలిపారు.

Leave a Reply