AP | సాగర్ కాలువలో దూకి ప్రాణాలు తీసుకున్న తల్లి-కూతురు

AP | సాగర్ కాలువలో దూకి ప్రాణాలు తీసుకున్న తల్లి-కూతురు

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ కుడి కాలువలోకి దూకి మహిళ తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల మండలం తాళ్లపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ తన కుమార్తెతో కలిసి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి దూకినట్లు సమాచారం.

సమీపంలో ఉన్న వ్యవసాయ కూలీలు ఈ ఘటనను గమనించి వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. విజయపురి సౌత్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ స్థానికులు కాదని, ఎక్కడి నుంచో వచ్చి ఈ చర్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply