AP | తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్

AP | తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్
- రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
AP | ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు అని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం మచిలీపట్నంలో ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీడీపీ నేతలతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. సామాన్యమైన రైతు కుటుంబంలో కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు.
రాజకీయాల్లో కూడా ఆనాడు దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి రాష్ట్రమంతా బస్సులో తిరిగి 9 నెలల్లో అధికారం తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కిలో బియ్యం రూ.2లు, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, రిజర్వేషన్లు తీసు కొచ్చారని తెలిపారు. తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగువాడి ఖ్యాతి దేశమంతా చాటుతున్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రతీ కుటుంబం ఆనందంగా ఉందని తెలిపారు. కుటుంబాలు’కుటుంబాలు కదిలి తెలుగు రాష్ట్రాన్ని కళకళలాడించారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి, అభివృద్ధి, సంక్షేమం వారిలో ఆనందం. ఆత్మవిశ్వాసం కలిగిస్తోందన్నారు. నందమూరి తారక రామారావు కోరుకున్న తెలుగు జాతి ఐక్యమత్యంగా ముందుకు వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
