మైలవరం నియోజకవర్గంలో 40,065 మందికి రూ.17.30 కోట్ల పింఛన్లు.

మైలవరం నియోజకవర్గంలో 40,065 మందికి రూ.17.30 కోట్ల పింఛన్లు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ భరోసా పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 40,065 మందికి రూ.17.30 కోట్ల పింఛన్ సొమ్మును ఈ నెల పంపిణీ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడులో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు, కూటమి నేతలు బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. రెడ్డిగూడెం మండలంలో 7,074 మందికి రూ.3.04కోట్లు, మైలవరం మండలంలోని 9,408 మందికి రూ.4.06కోట్లు, విజయవాడ రూరల్ మండలంలోని 5,416 మందికి రూ.2.32 కోట్లు, జి.కొండూరు మండలంలోని 8,406 మందికి రూ.3.60 కోట్లు, ఇబ్రహీంపట్నం మండలంలోని 4,682మందికి రూ.2.01 కోట్లు, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5,180 మందికి రూ.2.27 కోట్లు మంజూరయ్యాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన సామాజిక భద్రత పింఛన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



