లయోలా కళాశాలలో జాతీయ సదస్సు…

లయోలా కళాశాలలో జాతీయ సదస్సు…
వాణిజ్య,నిర్వహణ విద్యలో నూతన ధోరణులపై సదస్సు
ఆంధ్రప్రభ, పటమట : విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల వాణిజ్య వ్యాపార పరిపాలన విభాగం ఆధ్వర్యంలో రూసా ప్రాయోజిత జాతీయ సదస్సు “వాణిజ్య నిర్వహణ విద్యలో వర్ధమాన ధోరణులు బోధనా పద్ధతులు, పాఠ్యప్రణాళిక నూతనత్వం మరియు డిజిటల్ పరివర్తన పోస్టర్ను ఆదివారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా ఆవిష్కరించారు. కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ డా. రెక్స్ ఏంజెలో, ప్రిన్సిపాల్ ఫాదర్ డా. మెల్చియోర్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య నిర్వహణ డీన్ డా. ఎన్.ఎ. ఫ్రాన్సిస్ జేవియర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డా. బి. శ్యామ్ సుందర్, డా. బి.ఆర్. కుమార్, కన్వీనర్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ జాతీయ సదస్సు మార్చి 30, 31 తేదీలలో కళాశాల సెమినార్ హాల్లో జరగనుంది. సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభ సమావేశం జరుగుతుండగా, ఎన్టీఆర్ జిల్లా జీఎస్టీ కమిషనర్ డా. కె. రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. లీబా చెన్నై మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సెంటర్ ఛైర్మన్ డా. సునీల్ వకయిల్ కీలకోపన్యాసం చేయనున్నారు. వాణిజ్య మరియు నిర్వహణ విద్యలో వినూత్న బోధనా విధానాలు, పాఠ్యప్రణాళికలో మార్పులు, డిజిటల్ పరివర్తన ప్రాధాన్యంపై సదస్సులో చర్చలు జరగనున్నాయి. విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు సదస్సులో పాల్గొనవలసిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు. నమోదు వివరాల కోసం కన్వీనర్ నిర్మలా రాణిని సంప్రదించవచ్చని తెలిపారు.
