పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలోని పరాసుపేట ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త చెదారాన్ని ఆయనే స్వయంగా తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో భాగంగా తొలుత ప్రభుత్వ కార్యాలయాల స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

ప్రస్తుతం మచిలీపట్నంలోని పలు రహదారుల వెంబడి పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టి అనంతరం కాలనీలోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు సహకరించి స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నాలుగవ శనివారం స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడంతో ప్రభుత్వ అధికారులు సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖర రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply