రాములోరికి కలెక్టర్ పట్టువస్త్రాల సమర్పణ..

రాములోరికి కలెక్టర్ పట్టువస్త్రాల సమర్పణ..
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నంలోని భద్రాద్రి రామాలయంలో సీతారాములకు కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారి పట్టు వస్త్రాలతో వచ్చిన కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ శిరీష ఆలయ విశిష్టతను కలెక్టర్కు వివరించారు.
