దేవాలయానికి మూడు కియోస్క్ మిషన్లు అందజేత..

దేవాలయానికి మూడు కియోస్క్ మిషన్లు అందజేత..

మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం మెరుగైన సేవలందించేందుకు కరూర్ వైశ్య బ్యాంక్ వారు మూడు కియోస్క్ మిషన్లను అందజేశారు. ఈ కియోస్క్ మిషన్ల ద్వారా భక్తులు టిక్కెట్ కౌంటర్ల వద్ద ఎక్కువసేపు నిరీక్షించకుండా, నేరుగా సేవా టికెట్లు పొందడం, ఈ-హుండీ ద్వారా విరాళాలు సమర్పించడం, అలాగే దేవస్థానం సంబంధించిన వివిధ సమాచారాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించబడింది. ఈ మిషన్లను ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకి కరూర్ వైశ్య బ్యాంక్ ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు, ఆలయ సిబ్బంది మరియు బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply