మాజీ మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం..

మాజీ మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం..

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మాజీ మంత్రి వర్యులు పేర్ని వెంకట్రామయ్య ఇటీవల పామర్రు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు గురించి, పామర్రు పోలీస్ వారి గురించి మచిలీపట్నం సబ్ జైల్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా అవాస్తవాలు మాట్లాడడం జరిగిందని జిల్లా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేర్ని వెంకట్రామయ్య మాట్లాడినట్లుగా గొడవ పోలీస్ స్టేషన్ లో జరగలేధు, పోలీస్ స్టేషన్ గేట్ దగ్గర జరిగిందని, గుండెల మీద ఛాతి మీద చేయి పెట్టి ఒక తోపు తోసి, బూతులు మాట్లాడుతూ బయటకు తోసినట్టుగా ఆ మహిళ చేసిన అభియోగాలు అవాస్తవమన్నారు. సీఐ కానీ, ఎస్ఐ గాని ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదని, అక్కడ వేరే కేసు నిమ్మిత్తము వచ్చిన వారు సదరు మహిళ గొడవ చెయ్యడం గమనించారన్నారు.

వెంకట్రామయ్య ఆమెకు రక్త గాయములు అయినట్లు ప్రెస్ మీట్ లో చెప్పినారు కానీ ఆమెను పరీక్షించిన మచిలీపట్నం గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించి ఆమెకు ఎలాంటి రక్తగాయలు కానీ, ఇతర గాయాలు కానీ ఆమె శరీరం పై లేవని రిపోర్ట్ ఇచ్చి ఉన్నారన్నారు. సదరు వండ్ సర్టిఫికెట్ ను పోలీసు వారు సేకరించడం జరిగిందని, ఆమె ఫోన్ చేస్తే వచ్చిన 108 సిబ్బంది ఆమెను పరీక్షించి ఆమెకు ఎలాంటి గాయాలు లేవని వెనుదిరిగినారన్నారు. సదరు 108 సిబ్బంది ఇందుకు సంబందించిన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. సుప్రియ అమాయకురాలు మరియు ఎస్సీ కులమునకు చెందిన అమ్మాయి అని, ఆమె మీద పోలీసు వారు దాడి చేసినట్లు మాజీ మంత్రి నిందితురాలు మాటలు మాత్రమే ఎటువంటి నిర్ధారణ లేకుండా స్వయంగా చూసినట్లు మీడియా ముందు మాట్లాడడం ఖండిస్తున్నామన్నారు.

గమనించవలసిన విషయం సుప్రియ దాడి చేసి, పొత్తి కడుపు ప్రవేట్ పార్ట్స్ దగ్గర తన్నిన మహిళా హోంగార్డ్ ఒక ఎస్టి(ST) వర్గానికి చెందిన మహిళ అన్నారు. నేరం చేసిన వాళ్లని కులం పేరుతో సమర్ధించడం, నిందితులు చెప్పిన దానిని నిజం అనే విధంగా నిర్ధారణ లేకుండా మాట్లాడడం ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనని, రాజకీయంగా వాడుకుంటానికి కులాల మధ్య వైశామ్యాలు రెచ్చగొట్టడానికి మాట్లాడినట్లు గమనిస్తూ ఖండిస్తున్నామన్నారు. సదరు నిందితురాలి సోదరుడైన తేజ దొంగతనం చేసినట్లు ప్రాథమిక రుజువులు ఉండటం వలన సిసిటివి ఫుటేజ్ లభ్యమవ్వడం వలన అతనిని పిలిపించడం జరిగిందని, అటువంటి వ్యక్తిని మీరు ఎలా పిలిపించారు, అతనిని వెంటనే పంపించకపోతే ఈవ్ టీజింగ్ కేసు మరియు రేప్ కేసు పెడతాను అని సిఐ మరియు ఎస్ఐని బెదిరిస్తూ ఆమెకున్న చదువు మరియు చట్టం మీద ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని తప్పుడు నిందలు పోలీస్ మీద వేయడానికి ఉపయోగించిందన్నారు.

బెదిరించే ధోరణిలో మాట్లాడటం తప్పు కానట్లు, ఆ విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేయడం పెద్ద విషయం కానట్లు, ఒక నిందితురాలు అంతా నిజమే చెప్పినట్లు మీడియా ముఖంగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. సుప్రియ చేసిన పని, ఆమె తీవ్రంగా తిడుతూ దాడి చేసిన వైనం, మహిళా హోంగార్డ్ సొమ్మసిల్లి పడిపోగా ఆమెను హాస్పిటల్ కు తరలించడం అక్కడ ఉన్న సుమారు 15 నుండి 20 మంది గమనించారని మరియు ఒక మహిళ ఆమె కారులో హుటాహుటిన హోంగార్డ్ కోటేశ్వరమ్మను హాస్పిటల్ కి తీసుకెళ్లారన్నారు.

ఇక్కడ బ్లాక్ మెయిల్ చేస్తే తన సోదరుడిని వదిలేస్తారు అనే ఉద్దేశంతో హోంగార్డుతో గొడవపడి ఆమెను గట్టిగా కొడితే చనిపోయే ఆస్కారం ఉన్న పొత్తికడుపు భాగంలో కొట్టడమే కాకుండా ఆ హోమ్ గార్డ్ సుప్రియ దాడిలో సొమ్మసిల్లి పడిపోగా, ఆ విషయం తప్పుదోవ పట్టించడానికి ఈమె 108కు కాల్ చేసిందని, సదరు 108 వారు సుప్రియ బాగానే ఎటువంటి గాయం లేకుండా ఉందని తీసుకుని వెళ్లడానికి నిరాకరించారన్నారు. అంతేకాకుండా మచిలీపట్నంలో డాక్టర్లు సుప్రియను పరీక్షించి ఆమెకు ఎటువంటి గాయాలు లేవని సర్టిఫై చేసి వండ్ సర్టిఫికెట్ లో అదే విధంగా నమోదు చేశారన్నారు.

అయితే కేసు నమోదు కాబడింది అని తెలిసి పోలీస్ వారి నుండి తప్పించుకుని డిశ్చార్జ్ రాయకుండానే హాస్పటల్ నుండి కలెక్టరేట్ కు వెళ్ళింది అక్కడ తన ఫిర్యాదు ఇచ్చిన పిమ్మట మాత్రమే చట్ట పరంగా ఆమెను అక్కడ నుండి పరారు అయ్యే ముందు పోలీసు వారు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆమెను ఫిర్యాదు చేయకుండా ఎక్కడ ఆపలేదని, సదరు హాస్పిటల్ రికార్డ్స్ పోలీసు వారు సేకరించడం జరిగిందన్నారు. కావున అవాస్తవాలు మాట్లాడుతూ ఎటువంటి నిజ నిర్ధారణ లేకుండా కులాల పేర్లను ప్రస్తావించి, వక్రీకరిస్తూ, పోలీసులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మాట్లాడిన పేర్ని నాని ప్రెస్ మీట్ యొక్క సారాంశాన్ని ఖండిస్తున్నామన్నారు.

Leave a Reply