ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామంలోని పెద్దగూడెంలో ఉన్న రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారామ లక్ష్మణుల కళ్యాణ కార్యక్రమంలో ఘంటసాల సర్పంచ్ బాణవత్ వెంకటేశ్వరమ్మ – జి.శ్రీనివాసరావును పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దిరిశం పిచ్చేశ్వరరావు, పెద్దగూడెం వాసులు దిరిశం శ్రీను, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
