AP | ఘోర రోడ్డు ప్రమాదం..

AP | ఘోర రోడ్డు ప్రమాదం..
ప్రవేట్ ట్రావెల్ బస్సు టైర్ పెలి తీవ్ర ప్రమాదం..
బస్సులో 35 మంది ప్రయాణికులు…
పదిమందికి తీవ్ర గాయాలు..
AP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల కడప జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున నంద్యాల సమీపంలోని చాబోలు మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రవేట్ ట్రావెల్ బస్సు టైరు పేలి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి వెళ్ళిపోయింది. బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి పక్క పొలంలోకి దూసుకెళ్లింది. ఈ బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళుతుంది.ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సులో ఉన్న డ్రైవర్ తెల్లవారుజామున అతివేగంతోను నిద్రమత్తులోనూ ఉండటంతో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇటీవల పోలీసులు స్టాప్ అండ్ ఫేస్ వాష్ గో కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ కార్యక్రమము తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రమే పోలీసులు స్పందిస్తారని ప్రయాణికులు భావిస్తున్నారు.బస్సు ఒకసారి గా టైరు పేలడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయానికి ఆందోళనకు గురి అయ్యారు .తీవ్రంగా గాయపడిన వారిని 108 ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తక్షణమే స్పందించారు. బాధితులను చికిత్స నిమిత్తం తరలించారు. కి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

