భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్ధనలు..!

భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్ధనలు..!
కోడూరు, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కోడూరు శివారు యర్రారెడ్డి పాలెం ఈద్గా నందు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువు మౌలాలి ఈ పవిత్ర మాసంలో ఉపవాసం, నమాజ్, దానధర్మాలు పాటించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి పొందవచ్చని వారు తెలిపారు. అల్లాహ్ కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థించారు. మస్జీద్ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించి, దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం మనుషుల మధ్య ప్రేమ, దయ, సహనం పెంపొందించే పవిత్ర కాలమని మత పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు మరియు భక్తులు పాల్గొన్నారు.
