తెలుగుదేశం పార్టీ.. డ్రగ్స్ మాఫియాకు ప్రధాన కేంద్రం..

తెలుగుదేశం పార్టీ.. డ్రగ్స్ మాఫియాకు ప్రధాన కేంద్రం..

వైస్సార్సీపీ అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్

ఆంధ్రప్రభ, భవానిపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ డ్రగ్స్ మాఫియాకు ప్రధాన కేంద్రంగా మారుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన ఒక సంఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడమే కాకుండా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో ‘డ్రగ్స్ పాజిటివ్’ అని తేలడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోందని పేర్కొన్నారు. ​ఈ సందర్భంగా కామరాజ్ హరీష్ మాట్లాడుతూ పలు కీలక అంశాలను లేవనెత్తారు ​కూటమి ప్రభుత్వ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తుందన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ‘యాంటీ డ్రగ్స్’ పేరుతో సైకిల్ యాత్రలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఆర్భాటం చేస్తోందని,కానీ మరోవైపు తమ సొంత పార్టీ ఎంపీలే డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు.​చర్యలు ఎక్కడ?: డ్రగ్స్ పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేష్ కి పాజిటివ్ అని రిపోర్టులు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ,తెలుగుదేశం పార్టీ కానీ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ​

ప్రజల ఓట్లతో గెలిచిన బాధ్యత ఎక్కడ అని ప్రశ్నించారు. లక్షలాది మంది ప్రజల ఓట్లతో గెలిచి,చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎంపీ ఇలాంటి అనైతిక పనులకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు.​రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తక్షణమే స్పందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. డ్రగ్స్ మాఫియాను అరికడతామని చెప్పే మీరు,మీ పార్టీ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.​ రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్ముడవుతున్న డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోందని,డ్రగ్స్ ను ప్రోత్సహిస్తున్న ఇలాంటి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Leave a Reply