టెన్త్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు..

టెన్త్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు..
పెడన, ఆంధ్రప్రభ : ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించే పదవ తరగతి పరీక్షలు శాంతియుతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పెడన వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు పెడన ఎస్సై గంట్ల సత్యనారాయణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష పూర్తయ్యే వరకు విద్యార్థులను బయటకు పంపడం జరగదని, హాల్ టికెట్ లేనిదే లోపలికి అనుమతి లేదని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లో,స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను, పరీక్షా కేంద్రాలకు తీసుకురావడం పూర్తిగా నిషేధమన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని,కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుమిగూడరాదని స్పష్టం చేశారు. పరీక్షా సమయంలో కేంద్రాల సమీపంలో జిరాక్స్ ఇంటర్నెట్ షాపులను మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు.
