గంజాయి మత్తు పదార్థాల పై అవగాహన ర్యాలీ..

గంజాయి మత్తు పదార్థాల పై అవగాహన ర్యాలీ..
గంజాయి , మత్తు పదార్థాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
ఒంగోలుడీఎస్పీ రావిపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ
చీమకుర్తి రూరల్, ఆంధ్ర ప్రభ : చీమకుర్తి మండలం లోని బుదవాడ పంచాయతీ మర్రిచెట్ల పాలెం గ్రామంలో శుక్రవారం ఉదయం ఒంగోలు డియస్ రావిపాటి శ్రీనివాసరావు గారి అద్వర్యం లో, చీమకుర్తి సి ఐ డి.ప్రసాదు మరియు ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఏడు మంది ఎస్ఐ లు మరియు కానిస్టేబుల్ సిబ్బంది 35 మంది గ్రామం లోని ఎస్టీ కాలనీ లో కార్దన్ సెర్చ్ నిర్వంచడ మైనది. గ్రామంలో అనుమానిత వ్యక్తులు ను మరియు వాహనాలు ను తనిఖి చేయగా, 8 మోటార్ సైకిల్ ల కు ఎలాంటి డాకుమెంట్స్ లేనందున స్వాదిన పర్చుకోనడ మైనది.
అదే విధం గా మర్రిచేట్లపాలెం గ్రామం లోని ఎస్టీ కాలనీ లో గంజాయి మరియు మత్తు పదార్ధలు గురించి అవగాహన నిమ్మిత్తం, గ్రామం లోని ప్రజల తో ఒంగోలు డిఎస్పి రావిపాటి శ్రీనివాసరావు గారి అద్వర్యం లో ర్యాలి ని నిర్వంచడ మైనది మరియు గంజాయి గురించి గ్రామ ప్రజల తో ప్రతిజ్ఞ కూడా చేయించడ మైనది. ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రావిపాటి శ్రీనివాసరావు, చీమకుర్తి సిఐ డి. ప్రసాదు, ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఏడు మంది ఎస్ఐ లు మరియు 35కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
