శ్రీరామ నవమి ఉత్సవాలకు ఏర్పాట్లు..

శ్రీరామ నవమి ఉత్సవాలకు ఏర్పాట్లు..

తెనాలి, ఆంధ్రప్రభ : “రెండో భద్రాద్రి”గా ప్రసిద్ధి చెందిన తెనాలిలో శ్రీరామ నవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో సిద్ధమవుతున్నాయి.ప్రతి ఏటా ఇక్కడ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది శ్రీరామ నవమి మార్చి 27వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. ఇప్పటికే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. బోసురోడ్డు ప్రాంతంలోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వద్ద చలువ పందిళ్లు, భక్తులకు పానీయాలు, ప్రసాదాలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇక్కడ తాపమంటే ఆశ్రయం పొంది, రామభజనలు, హరికథలు, భక్తిగీతాలతో పాల్గొనవచ్చు.


గాడిబావి సెంటర్‌లోని దొంగ రాముని గుడి వద్ద శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది.ఈ కల్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. తెనాలిలోని వివిధ రామాలయాలు, వీధుల్లో చలువ పందిళ్లు, దీపాలతో అలంకరణలు, రామనామ సంకీర్తనలు, ప్రసాద వితరణతో భక్తిమయ వాతావరణం నెలకొననుంది.భక్తులు ఈ పవిత్ర సందర్భంగా శ్రీరాముడి ఆశీస్సులు పొందేందుకు విశేష పూజలు, ఉపవాసాలు, దానధర్మాలు చేస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ సీతారాముల కల్యాణ దర్శనం పొందాలని భక్తులకు స్థానిక సంఘాలు,ఆలయ కమిటీలు ఆహ్వానిస్తున్నాయి.

Leave a Reply