AP | అభివృద్ధి ప‌నులు ప్రారంభం

AP | అభివృద్ధి ప‌నులు ప్రారంభం

  • విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, అంగన్‌వాడీ స్కూల్ బిల్డింగ్స్ మరమ్మతులు..
  • స్కూల్స్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

AP | పెడన, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత చెరువ చేసేందుకే విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ఏర్పాటు కొంకేపూడి గ్రామంలో రూ.36 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.

పెడన మండలం చెన్నూరు గ్రామంలో 13 లక్షల స్కూల్స్ కాంపౌండ్ వాల్, 36 లక్షల విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. పెడన మండలం ఊరిమి గ్రామంలో 36 లక్షల విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. పెడన మండలం నందమూరు గ్రామంలో 12 లక్షల స్కూల్స్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply