గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత….

గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత….

ఎమ్మెల్యే తాతయ్య

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని నవాబుపేట గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం – పల్లె పండుగ 2.0 కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన 5 గోకులం షెడ్డులను అలాగే గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు స్థానిక నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో గ్రామీణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు దిశగా వేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు.

ప్రతి గ్రామానికి రోడ్లు, నీరు, వెలుగు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పల్లె పండుగ వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, నవాబుపేట గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నంబూరి వెంకటేశ్వరరావు, చెరువు ప్రెసిడెంట్ గింజుపల్లి వెంకటయ్య, సొసైటీ చైర్మన్ చింతా వెంకటేశ్వరరావు (బుల్లి), విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జామా ఆనందరావు, విజయవాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నల్లమోలు శివరామకృష్ణ ప్రసాద్ పెనుగంచిప్రోలు గ్రామ మాజీ సర్పంచ్ జిల్లేపల్లి సుధీర్ బాబు, అయిలపోగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply