స్వామి వారిని దర్శించుకున్న జిల్లా తెదేపా అధ్యక్షురాలు

స్వామి వారిని దర్శించుకున్న జిల్లా తెదేపా అధ్యక్షురాలు

గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెను వేద మంత్రాలతో ఆశీర్వదించారు.

ఆలయ అధికారిణి నేల సంధ్య స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఆమెతో పాటు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు రేగళ్ల లక్ష్మీ అనిత, తెదేపా సీనియర్ నాయకుడు చెరుకూరి రాజేశ్వరరావు, ఆలయ మాజీ అధ్యక్షుడు బెల్లం మధుసూదన్ రావు, మాజీ సభ్యుడు వనమా చిన్న అనంతరామయ్య, గ్రామ తెదేపా అధ్యక్షుడు వడ్లమూడి రాజశేఖర్, నియోజకవర్గ, మండల నాయకులు ఉన్నారు. అదేవిధంగా ఆలయం వెలుపల సేంద్రీయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్, మహిళల ఆటల పోటీలు ప్రారంభించారు.

Leave a Reply