AP | ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు ఆహ్వానం

AP | ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు ఆహ్వానం
AP | కృష్ణా జిల్లా, ఆంధ్రప్రభ : ఉంగుటూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెద్దఅవుటపల్లిలో సెయింట్ జోసఫ్ తంబి 81వ వర్ధంతి మహోత్సవాలు జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరుకావాల్సిందిగా గన్నవరం శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావును పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ పాలడుగు జోసఫ్ ఎమ్మెల్యేను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల విశిష్టత, భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా ఫాదర్ జోసఫ్ వివరించారు. ప్రతి ఏటా ఈ వర్ధంతి మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారని, ఈ ఏడాది కూడా వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడు కొలుసు రవీంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు మున్నా రామకృష్ణ, కుందేటి చంద్రశేఖర్, రెబ్బా తంబి తదితరులు పాల్గొన్నారు.
