Ap | క్యాన్సర్ నివారణపై అవగాహన కార్యక్రమం

Ap | క్యాన్సర్ నివారణపై అవగాహన కార్యక్రమం
శ్రీకాకుళం పిహెచ్సి ఆధ్వర్యంలో ర్యాలీ
Ap | ఘంటసాల, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ సాయి శరణ్య ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ల గురించి అవగాహన కల్పించారు. తొలి దశలోనే క్యాన్సర్ ను, గుర్తిస్తే నయం చేయవచ్చునని, ప్రాథమిక పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా యూనిట్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్.వి వాణి శ్రీ, హెచ్.ఎస్ రవికుమార్, హెచ్.వి రత్న కుమారి, ఏఎన్ఎం ధనశ్రీ, ఎంపీహెచ్ఏ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
