AP | కోకోనాడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్

AP | కోకోనాడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్
AP | విజయవాడ, ఆంధ్రప్రభ : కోకోనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 4 నుంచి 14 వరకు నిర్వహించనున్న కోకోనాడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ – 2026 కు సంబంధించి క్లబ్ సభ్యులు శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడుని విజయవాడలోని (Vijayawada) శాప్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వానిస్తూ, పోటీలకు సంబంధించిన పతకాలను రవి నాయుడు చేతుల మీదుగా అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. హాకీ క్రీడాకారుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని కాకినాడలో రూ. 2.5 కోట్ల సొంత నిధులతో జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఆధునిక హాకీ అకాడమీని నిర్మిస్తున్నట్లు రవి (Ravi) నాయుడుకి వివరించారు. ఈ అకాడమీ ద్వారా భవిష్యత్తులో రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతమైన హాకీ క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కోకోనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు రవిచంద్ర ప్రసాద్, అధ్యక్షులు ఎ. బాబ్జీతో పాటు ఇతర సభ్యులను శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల పట్ల వారి అంకితభావాన్ని ప్రశంసిస్తూ శాలువాలతో సత్కరించారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడంలో ఇటువంటి క్లబ్‌ల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
