ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్

ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్
- రూ. 10 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసిల్దార్ కార్యాలయంలో గురువారం రోజున పదివేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్ పట్టుబడ్డాడు. రాయదండి గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే రైతు భూమి ఫీల్డ్ ఎంక్వైరీ విషయంలో సదరు రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు.
కరీంనగర్ ఎసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సీఐలు తిరుపతి, పున్నం చందర్, ప్రేమ్ కుమార్లు రెడ్ హ్యాండెడ్ గా అంతర్గా రెవెన్యూ ఇన్స్పెక్టర్ను పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. గతంలో కూడా అంతర్గాం తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.
