లేడీ డాన్‌పై మరో కేసు..

ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్: ఇటీవలే వార్తల్లో నిలుస్తున్న నెల్లూరు లేడీ డాన్‌ నిడిగుంట అరుణ(Nidigunta Aruna) మెడకు ఉచ్చు మరింత బిగుస్తోంది.. ఆమెపై వరస కేసులు నమోదవుతున్నాయి.. తాజాగా.. ఆమెపై మరో కేసు నమోదైంది. అన్నదమ్ముల(brothers and sisters) ఆస్తివివాదంలో తలదూర్చి గన్‌(Gun)తో తనను బెదిరించారని బాధితుడు శశికుమార్(Sasikumar) ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు(Nawabpet Police) ఆమెపై కేసు(case) నమోదు చేశారు.

అరుణ దందాలపై ఆమె అనుచరులు పల్లం వేణు, అంకిం రాజా, షేక్ అప్సర్, షేక్ మునీర్, మచ్చకర్ల గణేష్, ఎలిషాలను కోవూరు CI సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy) విచారించారు. అరుణతో కలిసి చేసిన నేరాలు(Crimes), బెదిరింపులు(threats), దందాల(racketeering) గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సాయి అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను ఆక్రమించిన కేసులో అరుణతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కి పంపించారు. కోర్టు(Court)14 రోజుల రిమాండ్(Remand) విధించగా.. రేపటితో ముగియనుంది.. దీంతో పోలీసులు మళ్లీ ఆమెను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

నెల్లూరు జిల్లా కోవూరు(Kovuru) మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన బిల్డర్‌ను బెదిరించిన కేసులో గత నెల 19న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీషీటర్‌ శ్రీకాంత్(Rowdy sheeter Srikanth) గ్యాంగ్‌తో ఉన్న సంబంధాలు.. వారిని అడ్డం పెట్టుకుని చేసిన దందాలు గురించి పోలీసులు ఇప్పటికే వివరాలు సేకరించారు. ప్రధానంగా.. గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్‌లో దందాలు, దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడినట్లు పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉండడంతో వాటి ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోవూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply