మరో బస్సు దగ్ధం..

మరో బస్సు దగ్ధం..

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న విహారి ట్రావెల్స్ బస్సు నెంబర్ Nl.01.B.3250 బస్సు ఇంజన్లో నుండి మంటలు రావటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఇంజన్ లో మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను బస్సు నుండి కిందికి దింపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్ నుంచి స్లీపర్ కోచ్ ఏసీ బస్సు కందుకూరు వెళ్తుంది. అయితే.. బస్సులో మంటలు చెలరేగాయి అని తెలిసిన వెంటనే.. మెయిన్ డోర్ తో పాటు ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుని ప్రయాణికులు బయటకు దిగారు. అలా ప్రయాణికులు బయటికి దిగిన 5 నిమిషాలకే విహారి ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతో మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యం,నిర్వాకం బయటపడింది.

Leave a Reply