అవధులు లేని ఆప్యాయత..!


చిట్యాల, ఆగస్టు 9 (ఆంధ్రప్రభ) : అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి (RakhiPournami వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. అయితే బంధాలు, మమతానురాగాలు, ఆప్యాయతలు మానవులకే కాదు. మనం ఇష్టపడే ఏ ప్రాణిపైన అయినా చూపవచ్చునని ఆప్యాయతకు అవధులు లేవని నిరూపించాడు ఓ జంతు ప్రేమికుడు (AnimalFriendship).

వివరాల్లోకి వెళితే… రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని జయశంకర్ జిల్లా (Jayashankar District) చిట్యాల మండల కేంద్రంలో పెంపుడు శునకం (బన్ను) (bannu) కు ఇంటి యజమాని నేపాలి వేణు సింగ్ (Nepali Venu Singh) స్నానం చేయించి, తిలకం దిద్ది, రాఖీ కట్టి, అక్షింతలు వేసి, మంగళ హారతితో ఆశీర్వదించి తన పెంపుడు శునకంపై తనకున్న అనుబంధాన్ని చాటుకున్నాడు. ఈ శునకాన్ని అతను ఐదు సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా కుటుంబ సభ్యుల లాగా పెంచుకుంటున్నాడు.

Leave a Reply