Anganwadi | పౌష్టికాహారం అందజేత..

Anganwadi | పౌష్టికాహారం అందజేత..

Anganwadi, టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ ( వి) గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ నాంపల్లి వీరేశం, దొంతుల శ్రీనివాస్ సందర్శించారు. మంగళవారం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అంగన్వాడీకి వచ్చినటువంటి గుడ్లు, పాలు, బియ్యం, పప్పులు అందించారు.

పౌష్టికహారం ప్రతి రోజు తిని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రతి రోజు సబ్బుతో చేతులను శుభ్ర పర్చుకోవలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ నాంపల్లి వీరేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, విద్యార్థులు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply